 
															భక్తిశ్రద్ధలతో సందల్ శోభాయాత్ర
ఇల్లెందురూరల్: గార్వీ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని సీఎస్సీ బస్తీ గ్రామపంచాయతీ హజరత్ ఇమామ్ ఖాసీం ఆషుర ఖానాలో సయ్యద్ యాకూబ్‌షావళి బాబాకు మూడు రోజులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం బాబాకు సందల్ సమర్పించే కార్యక్రమాన్ని భక్తులు కోలాహలంగా నిర్వహించారు. సీఎస్సీ బస్తీ నుంచి పాతబస్టాండ్, జగదాంబ సెంటర్ మీదుగా హజరత్ ఇమామ్ ఖాసీం ఆషురఖానా వరకు సందల్‌తో శోభాయాత్ర నిర్వహించారు. ఆషుర్‌ఖానాలో హజరత్ యాకూబ్‌షావళికి సంప్రదాయయుతంగా సందల్ సమర్పించారు. అనంతరం దర్గా ప్రాంగణంలో భక్తులకు గార్వీ విందు ఇచ్చారు. కార్యక్రమంలో దర్గా మాలిక్ మహ్మద్ పాషా, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
