 
															గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్
ఇల్లెందు: ఎస్పీ రోహిత్‌రాజ్ ఆదేశాల మేరకు ఇల్లెందు సీఐ టి.సురేశ్ గంజాయి సరఫరా చేసే సపావత్ వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాశీరాంతండాకు చెందిన సపావత్ వెంకన్న గంజాయి సరఫరా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లా జైలులో ఉన్న వెంకన్నపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై భద్రాచలం, దుమ్ముగూడెం, రాజేంద్రనగర్, ఇల్లెందు తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. గత ఏడాది ఇల్లెందు పోలీసులు వెంకన్నను అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో వెంకన్నను అరెస్ట్ చేయగా.. చాకచక్యంగా తప్పించుకున్నాడు. పట్టణం దాటక ముందే ఆనాటి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. తాజాగా వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి, అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ సురేశ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ రోహిత్‌రాజ్ అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
