 
															ఉత్సాహంగా సాగిన ఈత ర్యాలీ
ఖమ్మంస్పోర్ట్స్: పోలేపల్లి మున్నేరుఒడ్డున ఈత ర్యాలీ ప్రారంభమై ఆరు కిలోమీటర్లపాటు ఉత్సాహంగా కొనసాగింది. ఆదివారం మున్నేరులో ఈతమిత్రుల సంఘం ఆధ్వర్యంలో కొన సాగిన ర్యాలీలో దాదాపు 150 మందికి పైగా యువకులు, పెద్దలు పాల్గొన్నారు. పోలేపల్లి నుంచి కరుణగిరి ప్రాంతంలోని గురుదక్షిణ ఫౌండేషన్ మున్నేరు ఒడ్డు వరకు సాగింది. సీనియర్ స్విమ్మర్స్ కోదాటి గిరి, బోజెడ్ల ప్రభాకర్, ఆర్గానిక్ రాంరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ దర్గయ్య, ఎకై ్సజ్ బుజ్జి, కోటేశ్వరరావు, గోపాల్‌రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ.. నీటి ప్రమాదాల నుంచి ప్రజలకు అవగాహన, రక్షణ కల్పించేందుకై మున్నేరులో లాంగ్ ఈత ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. వయస్సు కూడా లెక్కచేయకుండా ఎనభై ఏళ్లు దాటిన స్విమ్మర్లు, పిల్లలు పాల్గొన్నారని, ఏటా ర్యాలీ జరుపుతున్నామని వివరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
