 
															‘జీరో’ చేయాల్సిందే..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది, గత ఏడాది మార్కెట్‌లకు నిర్దేశించిన టార్గెట్, అవి సాధించిన లక్ష్యాలు..
2169.63 2265.02
మక్క రైతులను ఆదుకోవాలి..
క్రయవిక్రయాలు లేక పడావుపడుతున్న వ్యవసాయ మార్కెట్‌లు
ఫలితంగా రైతులకు తీరని నష్టం..
2025–26లో జిల్లా లక్ష్యం రూ.22.65 కోట్లు
ఇల్లెందు: గ్రామాల్లో పంటల కొనుగోళ్లు చేసే ప్రతీ వ్యాపారికి లైసెన్స్ ఉంటే జీరో దందా ఇక జీరో అయిపోతుందని, మార్కెట్‌ల నుంచి జిల్లా రాబడి రెట్టింపు అవుతుందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అక్రమ పద్ధతుల్లో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వ్యాపారులను గుర్తించి వారికి మార్కెట్ శాఖ నుంచి లైసెన్సులు ఇప్పించే చర్యలు కూడా ముమ్మరం చేశారు. దీని కోసం విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. గత ఏడా ది కంటే రెట్టింపు స్థాయిలో లైసెన్సులు ఇచ్చినప్పటికీ జిల్లావ్యాప్తంగా అన్ని మార్కెట్ల పరిధిలో అక్రమ పద్ధతుల్లో అనుమతులు లేకుండా వ్యాపారం చేసే వారు చాలా మంది ఉన్నారు. మార్కెట్ ఫీజు ఎగనామం పెట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్టర్లలో క్రయ విక్రయం నమోదు చేయడం లేదు. దీంతో మార్కెట్ ఆదాయం తరిగిపోతోంది. కొంతకాలంగా అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. తాజాగా పత్తి పంట విక్రయానికి కిసాన్ కపాస్ యాప్‌లో పంటల సాగు వివరాలు నమోదు చేసిన వారి నుంచే సీసీఐ కొనుగోలు చేసే అవకాశం ఉంది. చెక్ పోస్టు ఉన్నా ఏమీ చేయలేక మార్కెట్ పరిధి దాటి సరుకు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తోంది. జీరో దందాకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.
139 మందికి లైసెన్స్‌లు
జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. కొత్తగూడెం మార్కెట్ పరిధిలో 37 మంది వ్యాపారులు ఉండగా దమ్మపేట మార్కెట్ పరిధిలో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక భద్రాచలం మార్కెట్ పరిధిలో 10 మంది, చర్ల మార్కెట్ పరిధిలో 5, బూర్గంపాడు పరిధిలో 11 మంది ఉన్నారు. ఒక్క ఇల్లెందు మార్కెట్ పరిధిలో 68 మంది వ్యాపారులు ఉన్నారు. జిల్లాలో 139 మంది వ్యపారులకు లైసెన్సులు ఉన్నాయి. ఇందులో సగం ఒక్క ఏడాదిలో పొందిన వారే ఉన్నారు.
సీజన్ వస్తోంది..
ఏటా అక్టోబర్ నుంచి పంట ఉత్పత్తులు వస్తుంటాయి. పత్తి, మొక్క జొన్న పంటలు ముందే చేతికి వస్తుంటాయి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం జిల్లాలో నాలుగు మిల్లులకు అనుమతి ఇచ్చారు. ఈ దఫా భద్రాద్రి జిల్లాలో 44 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. కారేపల్లి, సుజాతనగర్, లక్ష్మీపురం, బూర్గంపాడులోని మిల్లుల ద్వారా సీసీఐకి పత్తి విక్రయించేలా గురువారం జిల్లా మార్కెట్ శాఖ అధికారి నరేందర్ అనుమతి ఇచ్చారు. జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్‌యార్డులు ఉన్నాయి. 2025–26 ఏడాదికి జిల్లా లక్ష్యం రూ.22.65 కోట్లుగా నిర్ణయించారు.
మార్క్‌ఫెడ్ కోసం ఎదురుచూపులు..
ఈ దఫా మొక్కజొన్న సాగు ఎక్కువైనప్పటికీ దిగుబడి మాత్రం తగ్గింది. విక్రయించుకునేందుకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉండగా గ్రామాల్లో వ్యాపారులు మాత్రం రూ.2 వేలకు మించి పెట్టడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారానైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన రైతులు కోరుతున్నారు.
మార్కెట్ గత ఏడాది ఈ ఏడాది లక్ష్యం లక్ష్యం
బూర్గంపాడు 586.05 625.34
దమ్మపేట 325.35 367.66
ఇల్లెందు 464.69 516.60
భద్రాచలం 200.00 194.60
కొత్తగూడెం 330.88 347.89
చర్ల 262.66 212.90
జిల్లాలో మక్క సాగు అత్యధికంగా ఉన్నా దిగుబడి మాత్రం తగ్గింది. అయితే మార్కెట్‌లో వ్యాపారులు తక్కువ రేటుకు మక్కలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించాలంటే తక్షణమే మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకోవాలి. –బానోతు
రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇల్లెందు
అనుమతి లేని వ్యాపారం నేరం..
జిల్లాలోని అన్ని మార్కెట్ల పరిధిలో అనుమతి లేకుండా, లైసెన్స్ పొందకుండా వ్యాపారులు కొనుగోళ్లు చేపడితే చర్యలు తీసుకుంటాం. వారి పంటలను సీజ్ చేస్తాం. ఇప్పటికే నాలుగు మిల్లులకు సీసీఐ ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అనుమతి ఇచ్చాం. ఇక మార్కెట్‌లలో పంటల కొనుగోళ్లకు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. అనుమతి కోరితే ఇచ్చేందుకు సిద్ధం.
–జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి
లైసెన్స్ లేకుండా వ్యాపారం.. మార్కెట్ ఆదాయానికి గండి
 
							‘జీరో’ చేయాల్సిందే..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
