 
															బాబా ఆలయంలో సంగారెడ్డి జడ్జి పూజలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో గల శ్రీ సాయిబాబా ఆలయాన్ని ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా జడ్జి సాయిభూపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జడ్జి సాయిభూపతిని ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదినారాయణ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
లయన్స్‌క్లబ్‌కు
ఎక్స్‌లెన్స్ అవార్డు
మణుగూరురూరల్: మెంటల్ వెల్ బీయింగ్ అండ్ వెల్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా మండలంలో తొమ్మిదిరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన మణుగూరు లయన్స్‌క్లబ్‌కు జిల్లాస్థాయి ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. సోమవారం ఖమ్మం ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన రెండో జిల్లా కేబినేట్ సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు షేక్ మీరాహుస్సేన్‌కు ఈ అవార్డును క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్‌మోహన్ చేతుల మీదుగా అందజేశారు.
నూతన విద్యా విధానాన్ని నిలిపివేయాలి
ఖమ్మంమామిళ్లగూడెం: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా పీఎంశ్రీ పాఠశాలలు ఏర్పాటు చేసి, నూతన విద్యా విధానం పేరుతో పసిపిల్లల మెదళ్లలో మతతత్వ బీజా లు నాటే ప్రయత్నం చేస్తోందని, వెంటనే నూత న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్‌భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. దేశవ్యాప్తంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పాలని, నూతన విద్యావిధానం ద్వారా మతత త్వ బోధనలు చేయాలని తలపెట్టిందన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి పీఎంశ్రీ పాఠశాల ఏర్పాటుచేయడానికిపూనుకుందని,రాష్ట్ర ప్రభు త్వం కూడా దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు శివ, వంశీ, గోపి, పవన్, నరేందర్, సందీప్, వెంకట్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల
క్రీడా జట్లు సిద్ధం
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, లాన్ టెన్నిస్ క్రీడాంశాల్లో వివిధ వయసు కేటగిరిల్లో ఎంపికలను నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. జిల్లా స్కేటింగ్ అండర్–11 బాలికల జట్టులో బి.రిత్విత, జి.సోనాక్షి, టి.జింగ్‌నార్ష, ఎస్.కె. సమీరా, పి.యోధ, వై.దేవర్షిశ్రీ, బాలుర జట్టులో కె.సాయిశ్రీతేజ, డి.లోహిత అభిరాం, ఎ.కౌశల్, ఆర్.రియాన్, డి.భవన్‌జై, బి.విశ్వకార్తీక్, అండర్–14 బాలికల జట్టులో టి.జ్ఞానవి, ఐ.వ్యూహిత, వి.పవిత్రయాదవ్, వై.చైతన్య, బాలుర జట్టులో ఎ.భువన్‌తేజ, ఎ.వవన్‌సాయి, అండర్–17 బాలుర జట్టులో డి.మదిలేశ్, ఎ.చరణ్, ఎండీ తౌహిద్, జిల్లా జిమ్నాస్టిక్స్ జట్టులో బి.మనోజ్ఞసుచరిత, జి.దీక్షితశ్రీ, ఆర్.లోహితసాయి, బాలురజట్టులో సాయిరాం భరత్, సీహెచ్ మోక్షచందర్, ఎస్.కె.హమీద్‌అలీ, లాన్ టెన్నిస్ అండర్–14 బాలికల జట్టులో బి.ప్రీతి ప్రజ్వల్, బి.భానుశ్రీ, వి.నేహాశ్రీ, శాలిని, బాలురలో కె.వీరవర్దన్, బి.రిషిరాంనాయక్, ఎస్.తేజ్‌దీప్, ఎండీ మసూద్, గగన్‌దీప్, అండర్–17 బాలుర జట్టులో స్వప్నిల్, రఘురాం ఎంపికయ్యారు.
 
							బాబా ఆలయంలో సంగారెడ్డి జడ్జి పూజలు
 
							బాబా ఆలయంలో సంగారెడ్డి జడ్జి పూజలు
 
							బాబా ఆలయంలో సంగారెడ్డి జడ్జి పూజలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
