రాష్ట్రస్థాయి టీటీ టోర్నీలో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి టీటీ టోర్నీలో ప్రతిభ

Oct 27 2025 8:12 AM | Updated on Oct 27 2025 8:12 AM

రాష్ట్రస్థాయి టీటీ టోర్నీలో ప్రతిభ

రాష్ట్రస్థాయి టీటీ టోర్నీలో ప్రతిభ

ఖమ్మంస్పోర్ట్స్‌: హైదరాబాద్‌లోని డీఆర్‌ఎస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీ ల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్‌–11 బాలురలో జాయ్‌ ఇమ్మాన్యుయేల్‌ ద్వితీయస్థానం, అండర్‌–13 సింగిల్స్‌లో షేక్‌ సహాయల్‌ ఫజల్‌ ప్రథమ, అండర్‌–15 బాలురులో గౌరిశెట్టి చార్విక్‌ తృతీయస్థానం దక్కించుకున్నారు. అండర్‌–17 బాలురలో పరిటాల జలిత్‌ సింగిల్స్‌లో టైటిల్‌ను దక్కించుకోగా, పిట్టల మోహిత్‌ కృష్ణ తృతీయస్థానంలో.. అదే డబుల్స్‌ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాడు. బాలికల అండర్‌–17లో గద్దల సిరి ద్వితీయస్థానం, డబుల్స్‌లో ప్రథమస్థానంలో నిలిచింది. అండర్‌–13లో బొంతు సాయిశివాని ద్వితీయ, వి.సౌమ్య సింగిల్స్‌లో ప్రథమస్థానం, అండర్‌–13లో ఈలప్రోలు హరి, ఈలప్రోలు తరుణ్‌ సింగిల్స్‌లో ద్వితీయ, డబుల్స్‌లో ప్రథమస్థానంలో నిలిచారు. అండర్‌–15 బాలుర డబుల్స్‌లో రణధీర్‌రెడ్డి ప్రథమ, డబుల్స్‌లో ప్రథమ, సీతా ప్రజ్ఞాన్‌ ప్రథమ, జి.చంద్రికరాణి, జి.షర్మిలరాణి డబుల్స్‌ లో ప్రథమస్థానాల్లో నిలిచారు. వారిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలసాని విజయ్‌, కార్యదర్శి వి.సాంబమూర్తి, ఉపాధ్యక్షులు పరిటాల చలపతిరావు, గద్దల రామారావు, షేక్‌ జవహర్‌పాషా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement