 
															అండర్ – 19 క్రీడా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్, రగ్బీ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసా కలీం తెలిపారు. అండర్–19 బాస్కెట్‌బాల్ బాలుర జట్టులో జోయిదీప్, అబిద్, సిద్దు, వినయ్‌కుమార్, విష్ణు, చేతన్, ఖాదర్, సంజయ్, లోహిత్, తాస్‌విక్, రాజ్ కీర్తన్, బాలికల జట్టులో మౌనిక, జోషిత, సాగరిక, ధత్రి, అశిని, జబీన్, మనస్విని, లిఖిత, దీక్షిత, ప్రవళ్లిక, అక్షనీ, లావణ్య, సాయిచరిత, రగ్బీ బాలుర జట్టులో జి.ప్రవీణ్, బి.గణేష్, వి. రోమిత్, పి.వీరబ్రహ్మం, ఎం.శరణ్‌సాయి, ఎం. గోపీచంద్, డి.నోము, ఎ.రాకేష్, ఆర్. ఈశ్వర్, బి.రాజశేఖర్, యక్షిత్, బి.సంతోష్, టి.మనోహర్, కె.శ్రావణ్, పి.సాయితేజ, పి.విగ్నేష్, జి.నూతన్‌కుమార్, బాలికల జట్టులో ఎ.వేదశ్రీ, బి.సునీత, కె.సాత్విక, ఎస్.సోని, కె.మంజు, జి.మైసీ, జి.శైలజ, డి.హిమవర్షిని, జె.సాహితీ, పి.సల్మా, ఆర్.గీతయామిని, ఎస్.సాత్వి, బి.పావని, జె.ప్రవళ్లిక, ఐ.భవాని, ఎం.డి.ఆఫ్రీన్, జిచయవస్విని, కె.లాస్య ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
