ద్విచక్రవాహనం చోరీ | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం చోరీ

Oct 27 2025 8:12 AM | Updated on Oct 27 2025 8:12 AM

ద్విచక్రవాహనం చోరీ

ద్విచక్రవాహనం చోరీ

జూలూరుపాడు: మండలంలోని పడమటనర్సాపురం గ్రామంలో ఓ ఇంటి ఎదుట ఉన్న బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పడమటనర్సాపురం కాలనీకి చెందిన శ్రీరామ్‌ తన బైక్‌ను ఇంటి ఎదుట ఉన్న రేకుల్‌షెడ్‌లో నిలిపి ఉంచాడు. ఆదివారం నిత్రలేచి చూసేసరికి బైక్‌ కనిపించలేదు. బైక్‌ను దుండగులు కొత్తగూడెం వైపు తీసుకెళ్లినట్లు డేగలమడుగు సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలిసింది. శ్రీరామ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కుక్కలను తప్పించబోయి లారీ కిందికి..

ద్విచక్రవాహనం దూసుకుపోవడంతో మహిళ మృతి

సత్తుపల్లిరూరల్‌: రహదారిపై ఓ మహిళ స్కూటీపై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో తప్పించబోయి లారీకిందికి దూసుకుపోయింది. తీవ్రగాయాలతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణంలోని పోస్టాఫీస్‌ రోడ్డుకు చెందిన మోరంపూడి స్వర్ణలత (55) ద్విచక్రవాహనం(స్కూటీ)పై గంగారం వైపు నుంచి సత్తుపల్లికి వస్తోంది. తాళ్లమడ శివారున కుక్కలు అడ్డురావడంతో వాహ నం అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ధాన్యం కోసం ఆగి ఉన్న లారీ కిందకు దూసుకుపోయింది. లారీకింద భాగంలో ఇరుక్కుపోయిన స్వర్ణలత తలకు బంపర్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను సత్తుపల్లి 108 సిబ్బంది బయటకు తీశారు. మృతురాలికి భర్త రామకోటేశ్వరరావు, కుమారుడు నాగశ్యామ్‌, కుమార్తె నాగశ్రీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement