 
															పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు
కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈదాడిలో ఉదయం గ్రామానికి చెందిన ఓ బాలుడు గాయపడ్డాడు. సాయంత్రం గ్రామ పంచాయతీ కార్మికుడు గోపె నాగయ్యపై దాడిచేయగా నుదుటిన తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని పశువులు, మేకలను కరిచి గాయపర్చటంతో గ్రామస్తులు కుక్కను వెంబడించి హతమార్చారు.
రెండు బైక్‌లు ఢీ..
నలుగురికి తీవ్ర గాయాలు
టేకులపల్లి: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలై ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రాంపురం గ్రామానికి చెందిన కేళోతు లచ్చిరాం, కేళోతు నరసింహారావు, మాళోతు సక్రు ముగ్గురూ కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం అద్దెకు తీసుకున్న ఎద్దులను ఎర్రాయిగూడెంలోని యజమానికి అప్పగించేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. అక్కడి నుంచి బైక్‌పై ముగ్గురూ స్వగ్రామానికి బయలుదేరారు. దాసుతండా వద్దకు రాగానే బర్లగూడెంనకు చెందిన యువకుడు వేగంగా బైక్‌పై వచ్చి ముగ్గురు ఉన్న బైక్‌ని ఢీకొట్టాడు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇల్లెందు, టేకులపల్లికి చెందిన రెండు 108 అంబులెన్సులలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
