 
															రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
గుండాల: రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆళ్లపల్లి మండలంలో శనివారం ఆయన పర్యటించారు. రామాంజిగూడెం, పాతూరు రాయిలంక గ్రామాల నుంచి 80 కుటుంబాలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అమలుకాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరపించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మాజీ జెడ్పీటీసీ కొమరం హనుమంతు, పాయం నర్సింహరావు, ఎస్‌కె, బాబా, కిషోర్ బాబు, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
