 
															ఏజెన్సీలో క్రీడా సంబరాలు
ఏడూళ్ల బయ్యారంలో
ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో
క్రీడా పోటీలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
చదువుకున్న స్కూల్‌కు సహకరించాలి
పినపాక: క్రీడా సంబరాలకు ఏడూళ్ల బయ్యారం జెడ్పీఎస్‌ఎస్ హైస్కూల్ వేదిక కానుంది. నవంబర్ 8, 9, 10 మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బాలబాలికల విభాగాల్లో పది ఉమ్మడి జిల్లాల వారీగా జట్లు పోటీలకు హాజరుకానున్నాయి. ప్రతిభ చూపి న బాలబాలికలను జనవరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. క్రీడా పోటీల నిర్వహణకు దాతల సహకారం తీసుకుంటుంటున్నారు. కంది చారిటబుల్ ట్రస్ట్ పోటీలకు తోడ్పాటునందించనుంది. దాతలు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. బాలురు జెడ్పీహెచ్‌ఎస్, బాలికలు బయ్యారం గ్రామంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో బస చేయనున్నారు. పోటీల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్‌ను శుభ్రం చేస్తున్నారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సహాయ సహకారాలు అందించా లని కోరారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీ నివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీ హరి, సీతక్క హాజరుకానున్నట్లు అధికారులు తెలి పారు. పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
వచ్చే నెల 8నుంచి నిర్వహణ
చదువుకున్న స్కూల్‌కు, సొంతూరికి మంచి చేయాలనే సంకల్పంతో నా వంతు సహకారం అందిస్తున్నాను. రాష్ట్రస్థాయి పోటీలు నేను చదువుకున్న బయ్యారం పాఠశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది.
– కంది విశ్వభారత్‌రెడ్డి, ఎన్నారై,
కంది చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్
 
							ఏజెన్సీలో క్రీడా సంబరాలు
 
							ఏజెన్సీలో క్రీడా సంబరాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
