 
															తడిసి మొలకెత్తిన మక్కలు
ఇల్లెందురూరల్: మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్నలు తడిసి మొలకెత్తాయి. దీంతో రైతులు ఆవేదన చెందారు. మండలంలో సుమారు 25వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, 70 శాతం మేర విస్తీర్ణంలో కంకులను విరిచారు. యంత్రాల సహాయంతో కంకుల నుంచి గింజలను వేరుచేసి తేమశాతం కోసం కల్లాల్లో ఆరబెట్టారు. కొమరారం, మస్సివాగు, మాణిక్యారం, పోలారం గ్రామాల్లో ఆరబెట్టిన మక్కలు వానకు తడిసిపోయాయి. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ పట్టాలను కప్పినా కాపాడుకోలేకపోయారు. వర్షం అధికంగా కురవడంతో గింజలు తడిసి మొలకెత్తాయి. రైతులు శనివారం మొలకెత్తిన గింజలను చూసి ఆవేదనకు గురయ్యారు. తడిసిన మొక్కజొన్న లను మళ్లీ ఆరబెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యమే శాపంగా మారింది. మార్క్‌ఫెడ్ నిర్ణయించినట్లు చల్లసముద్రం, కొమరారం, వ్యవసాయ మార్కెట్‌లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
తీరని నష్టంతో రైతు కంట కన్నీరు
 
							తడిసి మొలకెత్తిన మక్కలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
