 
															పశువులు పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు అక్రమంగా తరలిస్తున్న పశువులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని గుండాల కాల నీ నుంచి తిరువూరుకు రెండు ట్రాలీ ఆటోల్లో 12 పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేశారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు.
70 బైక్‌లు స్వాధీనం
అశ్వారావుపేట: గంజాయి నిర్మూలన కోసం పోలీసులు చేపట్టిన ‘చైతన్యం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పట్టణంలోని వడ్డెర బజారు వద్ద నాకాబందీ, కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 టూవీలర్లు, 4 ఆటోలు, 4 కారులు, 6 ట్రాక్టర్లు, 2 లారీలు, బెల్టు షాపులలో నిల్వ ఉంచిన 16 లీటర్ల మద్యం స్వాధీన పరచుకున్నారు. గంజాయి వాడుక, విక్రయం, రవాణా చేయొద్దని అవగాహన కలిగించారు. సీఐ పింగళి నాగరాజురెడ్డి, ఎస్‌ఐలు యయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి, అఖిల, సిబ్బంది ఉన్నారు.
 
							పశువులు పట్టివేత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
