 
															అటవీశాఖకు ప్రభుత్వ భూమి అప్పగింత
జూలూరుపాడు: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని అటవీశాఖ అధికారులకు శనివారం అప్పగించారు. పాపకొల్లు నుంచి వయా రాజారావుపేట మీదుగా ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామాన్ని కలుపుతూ పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో బీటీ రోడ్డును నిర్మిస్తున్నారు. రాజారావుపేట, కేసుపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతం ఉంది. బీటీ రోడ్డు నిర్మాణంతో అటవీశాఖ భూమి ఐదెకరాల భూమి కోల్పోయింది. దీంతో అటవీ భూమికి బదులుగా జూలూరుపాడు రెవెన్యూ పరిధిలోని 250 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎఫ్‌డీఓ యు కోటేశ్వరరావు, ఇతర అధికారులు జి ప్రసాద్‌రావు, సీహెచ్ ఆదినారాయణ, ప్రవీణ్, శ్రీనివాసరావు, హనుమంతు, నరసింహారావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
