భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బాల భీముడి జననం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఓ మహిళ 5 కిలోల బాలుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మణుగూరు పట్టణ పరిధిలోని విప్పల సింగారం ప్రాంతానికి చెందిన జోగునూరి బాబు భార్య రాణికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మణుగూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. రాణిని పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో 2.05 నిమిషాలకు ఆపరేషన్ చేయగా ఐదు కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. కాగా జోగునూరి బాబు, రాణి దంపతులకు 2018లో ఒక బాబు (3.75 కేజీల బరువు) జన్మించాడు.
ఐదు కిలోల బాలుడు.. తల్లీ బిడ్డ క్షేమం


