వర్కర్‌కు వేతనం చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

వర్కర్‌కు వేతనం చెల్లింపు

Oct 24 2025 7:50 AM | Updated on Oct 24 2025 7:50 AM

వర్కర

వర్కర్‌కు వేతనం చెల్లింపు

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుదిమళ్ల ప్రాథమిక పాఠశాల స్కావెంజర్‌ ప్రమీలకు ఆరు నెలల వేతనం రూ.36 వేలు గురువారం అందింది. ‘వర్కర్‌ నిధులు పక్కదారి’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎంఈఓ ఉమాశంకర్‌, క్లస్టర్‌ హెచ్‌ఎం లాలు పాఠశాలను సందర్శించారు. వేతనం చెల్లించకపోవడంపై ప్రధానోపాధ్యాయుడు సురేందర్‌ నుంచి వివరణ తీసుకుని బకాయి వేతనం ఇప్పించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఎంఈఓ తెలిపారు.

15 ఎకరాల్లో

‘ఆయిల్‌పామ్‌’ తొలగింపు

అశ్వారావుపేట: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన రైతులు ఆర్ల కృష్ణ, తోట పిచ్చయ్యలకు చెందిన 15 ఎకరాల ఆయిల్‌పామ్‌ తోటలను గురువారం తొలగించారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కల్లో కల్తీ మొక్కలు ఎక్కువగా ఉండి దిగుబడి రాకపోవడంతో మొక్కలను రైతులు తొలగించారు. ఎకరాకు ఏటా రూ.లక్ష మేర పెట్టుబడి పెట్టిన రైతులు నిండా మునిగిపోయారు. తిరిగి ఆయిల్‌పామ్‌ మొక్కలు పెడితే కాస్తాయనే నమ్మకం అధికారులు కలిగించాలని రైతులుకోరుతున్నారు.

పటిష్ట ఏర్పాట్లు చేయాలి

పినపాక: మండలంలోని ఈ బయ్యారం జెడ్పీహెచ్‌ఎస్‌ హైస్కూల్లో నిర్వహించే అండర్‌–17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు అధికారులు ఆదేశించారు. గురువారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు సుధీర్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌, వెంకటేశ్వరరావు, నాగయ్య పాల్గొన్నారు.

ఏజెన్సీలో పోలీసుల అప్రమత్తం

దుమ్ముగూడెం : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ను నిరసిస్తూ మావోయిస్టులు శుక్రవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం పెద్దబండిరేవు క్రాస్‌ రోడ్డు, పెద్దనల్లబల్లి ప్రధాన రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీల చేపట్టారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను, ప్రజలను క్షుణంగా తనిఖీ చేశారు. సరిహద్దు గ్రామాల్లో గాలింపు చేపట్టారు. సీఐ వెంకటప్పయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సుల నిలిపివేత

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే బస్సులు నడుపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో చర్ల, కుంట, చింతూరు ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

రామాలయంలో హల్‌చల్‌

ఈఓకు ఫిర్యాదు..

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బందికి – ఓ వ్యక్తికి నడుమ గురువారం వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో దేవస్థానంలో కాంట్రాక్టర్‌గా పని చేసిన ఓ వ్యక్తి మధ్యాహ్నం దర్శనాలు నిలిపివేసే సమయంలో కొందరిని దర్శనానికి తీసుకురాగా, అక్కడ విధులు నిర్వర్తించే ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వారిని అడ్డుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి ‘నేనెవరో తెలియదా’ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. మాటామాట పెరగడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి నివారించే ప్రయత్నం చేయగా, ఆయనతోనూ ఇలాగే వ్యవహరించాడు. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఈ ఉదంతంపై ఆలయ ఈఓ దామోదర్‌రావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఈఓను వివరణ కోరగా.. విచారణ చేపడతామని తెలిపారు.

వర్కర్‌కు వేతనం చెల్లింపు1
1/3

వర్కర్‌కు వేతనం చెల్లింపు

వర్కర్‌కు వేతనం చెల్లింపు2
2/3

వర్కర్‌కు వేతనం చెల్లింపు

వర్కర్‌కు వేతనం చెల్లింపు3
3/3

వర్కర్‌కు వేతనం చెల్లింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement