పెద్దమ్మతల్లి వైన్స్‌కు రూ.3.06 కోట్లు
పెద్దమ్మగుడి షాపునకు అధిక టెండర్లు...
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయం వద్ద నిర్వహించే మద్యం దుకాణ లైసెన్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ మంది ఈ షాపు కోసం దరఖాస్తులు చేశారు. పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద వైన్స్‌ను ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. దీనికి ఈ నెల 18వ తేదీ వరకు 100 టెండర్లు రాగా, తర్వాత గడువు పొడిగించడంతో మరో రెండు టెండర్లు పడ్డాయి. దీంతో ఎకై ్సజ్ శాఖకు రూ.3.06 కోట్ల ఆదాయం లభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 207 మద్య దుకాణాలు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 88 షాపులు, ఖమ్మం జిల్లాలో 119 మద్య దుకాణాలు ఉన్నాయి. వీటిన్నింటికి నూతన లైసెన్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టగా, పెద్దమ్మగుడి వద్ద దుకాణానికి మాత్రమే అత్యధికంగా 102 టెండర్లు దాఖలు చేశారు.
2023లో రూ.2.48 కోట్లు
2023లో నిర్వహించిన టెండర్లలో 124 దరఖాస్తులు రాగా రూ.2.48 కోట్ల ఆదాయం లభించింది. గతంలో కంటే ఈసారి 22 టెండర్ల సంఖ్య తక్కువైనా ఆదాయం పెరిగింది. గతం కంటే రూ.58 లక్షలు ఎక్కువగా వచ్చింది. గతంలో లైసెన్స్ ధర దరఖాస్తుకు రూ. 2 లక్షలు ఉంటే ఈసారి రూ. 3 లక్షలకు పెంచిన విషయం విదితమే. పాల్వంచ పట్టణంలో మొత్తం 8 వైన్ షాపులు ఉండగా 213 టెండర్లు వచ్చాయి. తద్వారా రూ.6.60 కోట్ల ఆదాయం వచ్చింది.
ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా
102 దరఖాస్తులు
పాల్వంచ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 13 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి తొలుత 525 టెండర్లు వచ్చాయి. గడువు పొడిగించాక మరో 15 టెండర్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దమ్మగుడి వద్ద షాపునకే మొత్తం 102 టెండర్లు లభించాయి.
–ప్రసాద్, ఎకై ్సజ్ సీఐ


