 
															తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
టేకులపల్లి: పత్తి పంటల్లో తెగుళ్ల నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్, సేద్య విభాగం శాస్త్రవేత్తలు కోరారు. గురువారం శాస్త్రవేత్తల బృందం మండలంలోని వెంకట్యాతండాలో క్షేత్ర సందర్శన జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశిస్తే ప్రోఫినోపాస్, దియోడికార్చ్, కాయకుళ్లు లక్షణాలు గమనిస్తే ప్లాంటమైసిన్, కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మిరపలో వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ల వద్ద పోయాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.శివ, డాక్టర్ ఎం.శరత్, వ్యవసాయశాఖ అధికారులు లాల్ చంద్, అన్నపూర్ణ, విశాలచౌహాన్ పాల్గొన్నారు.
పశువులు పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఎటపాక నుంచి హైదరాబాద్‌కు ట్రాలీలో తరలిస్తున్న 11 పశువులను గురువారం బ్రిడ్జి సెంటర్‌లో ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
 
							తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
