 
															త్రుటిలో తప్పిన ప్రమాదం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జిలో మరో మారు యాష్ ట్యాంకర్ బోల్తాపడింది. గురువారం తెల్లవారుజామున ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ నుంచి ఖమ్మం వైపు యాష్ ట్యాంకర్ వెళ్తోంది. అదే సమయంలో ట్రాలీ ఆటో సిమెంట్ మిక్సింగ్ మిషన్, జనరేటర్‌ను తీసుకుని వెళ్తోంది. ఈ క్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జిలోకి రాగానే యాష్ ట్యాంకర్ ముందు ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఆ సమయంలో ట్రాలీలో ఐదుగురు కార్మికులున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గతంలో కూడా యాష్ ట్యాంకర్ ద్విచక్ర వాహనంపై పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే మరో సారి ట్యాంకర్ ప్రమాదం జరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
రైల్వే అండర్ బ్రిడ్జిలో యాష్ ట్యాంకర్ బోల్తా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
