 
															ఏఎన్‌ఎం కోర్సుతో ఉపాధి అవకాశాలు
ఖమ్మంఅర్బన్: ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసిన యువతులకు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌ఓ బి.కళావతి బాయి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (నర్సింగ్ కోర్సు) పూర్తి చేసిన విద్యార్థినులకు గురువారం క్యాపింగ్ ఉత్సవం నిర్వహించగా ఆమె మాట్లాడారు. నిరుపేద విద్యార్థినులకు మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ మాట్లాడుతూ రెండేళ్ల కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. డీసీహెచ్‌ఎన్ శేషు పద్మ మాట్లాడగా కోర్సు పూర్తి చేసిన వారికి పత్రాలు అందజేశారు. మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేతతో పాటు ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, విజయ్‌కుమార్, సుధీర్, సుకన్య, లాలయ్య, మౌనిక, దుర్గారావు, శాంతమ్మ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
