 
															ముగిసిన మద్యం టెండర్లు
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. మొదట ఈనెల 18తో గడువు ముగియగా.. దీపావళి, ఇతర సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు ఈనెల 22వ తేదీ వరకు 3,816 దరఖాస్తులు రాగా, చివరి రోజైన గురువారం 106 దరఖాస్తులు స్వీకరించామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మొత్తంగా 3,922 టెండర్లు దాఖలయ్యాయని, ఈనెల 27న కొత్తగూడెం క్లబ్ లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తామని వెల్లడించారు.
88 షాపులకు 3,922 దరఖాస్తులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
