 
															శిక్షణ పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలి
భద్రాచలంటౌన్ : గిరిజన నిరుద్యోగ యువత డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తయ్యాక సమయం వృథా చేయకుండా డ్రైవర్ ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. టీజీఆర్‌టీసీ వరంగల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన గిరిజన యువకులకు గురువారం తన చాంబర్‌లో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. భద్రాచలం ఆర్టీఓ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఆ లైసెన్సులను సద్వినియోగం చేసుకోవాలని, డ్రైవర్ ఉద్యోగాలు పొందాలని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
