 
															75 శాతం హాజరు తప్పనిసరి
● డీఐఈఓ వెంకటేశ్వరరావు ● దుమ్ముగూడెం ప్రభుత్వ కళాశాలలో తనిఖీ 
దుమ్ముగూడెం : ఇంటర్మీడియెట్ విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలని, అప్పుడే పరీక్ష ఫీజులు తీసుకుంటామని డీఐఈఓ హెచ్.వెకంటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి క్రమం తప్పకుండా కాలేజీకి హాజరవ్వాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అపార్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాబోయే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెరిగేలా తమకు కేటాయించిన పాఠశాలలపై దృష్టి పెట్టాలని అధ్యాపకులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్ కృష్ణవేణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు డ్రాయింగ్, ముగ్గుల పోటీలు..
నషా ముక్తి భారత్ అభియాన్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, జిల్లా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ రవి, డీడీఏసీ ప్రతినిధి సీహెచ్ స్వరూప, యాంటీ డ్రగ్ కౌన్సిలర్ కేపీడీ వరరాజు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
