 
															బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి
టేకులపల్లి: వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ పోలీస్ సిబ్బందికి సూచించారు. బోడు పోలీసుస్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల సీఐలు సత్యనారాయణ, సురేష్, రవీందర్, ఎస్‌ఐలు శ్రీనివాసరెడ్డి, రాజేందర్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
