 
															మాదక ద్రవ్యాలను వదిలేయాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం)/మణుగూరురూరల్: మాదక ద్రవ్యాలు లేని సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగూడెం, మణుగూరు పట్టణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు (కార్డన్ సెర్చ్) నిర్వహించారు. కొత్తగూడెంలో 37 బైకులు, 2 ఆటోలు, ఒక కారు, 20 బీర్ బాటిళ్లు, 223 క్వార్టర్లు (విలువ రూ.46,190) స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఇక మణుగూరులోని సురక్షా బస్టాండ్ ప్రాంతంలో అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో డీఎస్పీలు మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అల వాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మూడు టౌన్‌లు, చుంచుపల్లి సీఐ లు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ఎస్‌ఐలు, మణుగూరు ఇన్‌చార్జ్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ నగేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం, మణుగూరుల్లో కార్డన్ సెర్చ్
 
							మాదక ద్రవ్యాలను వదిలేయాలి..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
