 
															●ఇలా కూడా వాడొచ్చా..!
కూల్‌డ్రింక్స్ తాగి వృథాగా పడేసే ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో మట్టి నింపి.. ఓ ఉపాధ్యాయుడు మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. దీనిని చూసినవారంతా వీటిని ఇలా కూడా వాడొచ్చా? అని ఔరా అంటున్నారు. మండలంలోని బండారుగుంపులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బి.వెంకటేశ్వర్లు కూల్‌డ్రింక్ ఖాళీ బాటిళ్లను సేకరించి పాఠశాల ఆవరణలో ఉన్న వృక్షాలకు కట్టి, వాటిలో మట్టి నింపి పలు రకాల మొక్కల్ని పెంచుతున్నాడు. అవి పూలు పూసినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను బుధవారం ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది.
– అశ్వారావుపేటరూరల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
