రమణీయం.. రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. రామయ్య కల్యాణం

Oct 23 2025 2:32 AM | Updated on Oct 23 2025 2:32 AM

రమణీయ

రమణీయం.. రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి బుధవారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు–రాంప్రసాదమ్మ దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు ఇచ్చారు. ఈ సందర్భంగా దాత కుటుంబీకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

మైలురాయిగా

ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ

వీసీ యోగితారాణాతో

భేటీలో మంత్రి తుమ్మల

కొత్తగూడెం అర్బన్‌: కొత్తగూడెంలోని మైనింగ్‌ కళాశాలను డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ విద్యాచరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాతో మంత్రి హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవేశాలు, భవన నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించాక మంత్రి మాట్లాడారు. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ విద్యాసంస్థలో చదివే విద్యార్థులు భూశాస్త్రవేత్తలు, ఖనిజ నిపుణులుగా కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఎన్‌ఎండీసీ, సింగరేణి, కోల్‌ ఇండియా ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.

మునగ తోటల పరిశీలన

అశ్వారావుపేట(చండ్రుగొండ)/జూలూరుపాడు : చండ్రుగొండ, జూలురుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో పత్తి, వరి, మునగ పంటలను బుధవారం కృషి విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్‌ భరత్‌, శాస్త్రవేత్తలు శివ, శరత్‌ చంద్ర పరిశీలించారు. కోత సక్రమంగా రాలేదని, పూత సైతం రాలిపోయిందని చండ్రుగొండకు చెందిన రైతు మరకాల రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, అకాల వర్షాల కారణంగా ఇలా జరిగి ఉంటుందని, కొంతకాలం వేచి చూడాలని శాస్త్రవేత్తలు రైతుకు సూచించారు. వరి పంటలో బ్యాక్టీరియా, ఎండు తెగులు నివారణకు ఎకరానికి 400 గ్రాముల కాపర్‌ హైడ్రాకై ్సడ్‌, 60 గ్రాముల స్టేపీటోమైసిన్‌ సల్ఫై డ్‌ను పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఏఓలు దీపక్‌ ఆనంద్‌, వినయ్‌, ఏఈఓ విజయ భాను పాల్గొన్నారు.

వాలిపోయిన వరిపంట

కరకగూడెం/పినపాక: గాలివానకు వరి పంట దెబ్బతిన్నది. మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో కరకగూడెం, పినపాక మండలాల్లోని పద్మాపురం, జానంపేట, గోపాలరావుపేట గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. మరికొన్ని ప్రాంతాల్లో పొలాలు, చేలల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో రూ. లక్షల్లో పెట్టుబడి నష్టపోయినట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

రమణీయం..  రామయ్య కల్యాణం1
1/2

రమణీయం.. రామయ్య కల్యాణం

రమణీయం..  రామయ్య కల్యాణం2
2/2

రమణీయం.. రామయ్య కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement