స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి

Oct 22 2025 7:02 AM | Updated on Oct 22 2025 7:02 AM

స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి

స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి

ములకలపల్లి: యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని, తద్వారా ఆర్థికంగా బలోపేతం కావొచ్చని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. ములకలపల్లి మండలం రాజుపేట శివారులో చింతకాయల కుమారి, వెంకటేశ్వరరావు దంపతులు ఏర్పాటుచేసిన కౌజుపిట్టల కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా చేపలు, మేకలు, నాటుకోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. అంతేకాక ప్రభుత్వ రాయితీల ఆధారంగా మునగ, బంతి, వెదరు తోటల సాగుచేయాలని సూచించారు. ఈక్రమాన అక్కడ మేక పిల్లలను చూసిన కలెక్టర్‌... ఓ మేక బక్కగా ఉండడంతో మంచి ఆహారం సమకూర్చాలని ఇవ్వాలని తెలిపారు.

నర్సరీల్లో బయోచార్‌

డంపింగ్‌ యార్డుల్లో తయారుచేస్తున్న బయోచార్‌ను ప్రయోగాత్మకంగా ప్రభుత్వ నర్సరీల్లో వినియోగించాలని కలెక్టర్‌ పాటిల్‌ ఆదేశించారు. పూసుగూడెం శివారు డంపింగ్‌ యార్డులో ఏర్పాటు చేసిన బయోచార్‌ ప్లాంట్‌ ఆయన పరిశీలించారు. నరికేసిన చెట్ల కొమ్మలను ముక్కలుగా చేసి బయోచార్‌ యూనిట్‌లో మండించడం ద్వారా బొగ్గు తయారవుతుందని, ఆపై బొగ్గు పొడిగా చేసి ఎండిన ఆవుపేడ, మూత్రం కలపడం ద్వారా బయోచార్‌ తయారవుతుందని తెలిపారు. ఈ మిఽశ్రమాన్ని స్ప్రే చేయడం, మొక్కల మొదళ్లలో వేయడం ద్వారా సేంద్రియ ఎరువులా ఉపయోగపడుతుందని వివరించారు. డీఆర్‌డీఓ విద్యాచందన, తహసీల్థార్‌ భూక్యా గనియా, ఎంపీడీఓ రామారావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ హుస్సేన్‌, ఏపీఎం రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement