శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం

Oct 22 2025 7:02 AM | Updated on Oct 22 2025 7:02 AM

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): శాంతిభద్రతలను పరి రక్షిస్తూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పడమే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ కొనియాడారు. పోలీసు అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్‌ డే) సందర్భంగా మంగళవారం హేమచంద్రాపురంలోని హెడ్‌ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి కలెక్టర్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహశక్తులతో పోరాడి మరణించిన పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించడంలో పోలీస్‌ శాఖ నిలుస్తోందని చెప్పారు. ఎస్పీ రోహిత్‌రాజ్‌ మాట్లాడుతూ ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని ప్రజల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. సంఘ విద్రోహశక్తులతో పోరాటంలోవీరమరణం పొందిన పోలీసుల త్యాగా లను స్మరించుకోవడం అందని బాధ్యత అని చెప్పా రు. అనంతరం ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో అమరులైన 191 మంది ఉద్యోగుల పేర్లను ఏఎస్పీ నరేందర్‌ చది వారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రభాను, రెహమాన్‌, మల్లయ్యస్వామి, రవీందర్‌రెడ్డి, సతీష్‌ కుమార్‌, సత్యనారాయణ, లాల్‌బాబు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ అమరవీరుల దినోత్సవంలో

కలెక్టర్‌ పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement