 
															గిరిజనులకే తొలి ప్రాధాన్యత
భద్రాచలం: ఐటీడీఏ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న గిరిజన అభ్యుదయ భవనం, సమ్మక్క సారక్క ఫంక్షన్ హాల్ కేటాయింపులో గిరిజనులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఫంక్షన్ హాళ్లను మంగళవారం పరిశీలించిన ఆయన నిర్వహణ తీరు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ నామమాత్రపు రుసుముతో వివాహది వేడుకలు, సభలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఆదివాసీ గిరిజనులకు ఇవ్వాలని ఆదేశించారు. గిరిజనులు లేకపోతే గిరిజనేతురులకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి, పార్కింగ్ సౌకర్యాలు కల్పించి రికార్డుల నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఏఓ సున్నం రాంబాబు, డీఈ హరీష్, ఉద్యోగులు శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, పోశాలు పాల్గొన్నారు.
గాయపడిన విద్యార్థికి చేయూత
లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు విరిగిన గిరిజన విద్యార్థి వెలకం సంతోష్‌కు పీఓ రాహుల్ ఆర్థిక సాయం అందజేశారు. చికిత్స నిమిత్తం ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కు అందజేశారు. ఏఓ సున్నం రాంబాబు, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
