 
															రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడిగా లక్కినేని
కొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాదల ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బాధ్యులు ఎర్రపాటి కృష్ణ, సాధిక్ పాషా, అక్కినేని వెంకటదుర్గారావు, యెర్రా కామేష్, చిన్ని కృష్ణ, మారపాక రమేష్ అంబటి రమేష్, సామంత్, వడ్లకొండ హారిప్రసాత్, జె గోపికృష్ణ తదితరులు అభినందనలు లక్కినేనికి అభినందనలు తెలిపారు.
‘మద్యం’ దరఖాస్తుల
గడువు పెంపు
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపా రు. శనివారం బంద్ జరిగిన నేపథ్యంలో డీడీలు తీయలేకపోయామని పలువురు విజ్ఞప్తి చేయగా, గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో 27న మద్యం షాపుల డ్రా తీస్తామని తెలిపారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు 3,799 దరఖాస్తులు వచ్చాయని, తద్వారా ప్రభుత్వానికి రూ. 113.97 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. గడువు పెరిగిన నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
 
							రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడిగా లక్కినేని

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
