 
															రక్షణ సూత్రాలు పాటించాలి
సింగరేణి(కొత్తగూడెం): ఓబీ డంప్‌లలో హాలేజీ రోడ్లపై రక్షణ సూత్రాలను పాటిస్తూ పనులు చేయాలని, సంబంధిత అఽధికారులు పర్యవేక్షించాలని సింగరేణి (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కొత్తగూడెం ఏరియాలోని వీకే–7 ఓసీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ఓసీలో చేపడుతున్న మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టి తొలగింపు పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అనుకున్న సమయానికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం ఎం.శాలేంరాజు, అధికారులు శ్రీరమేష్, రామచంద్ర మురళి, కిశోర్ పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
