 
															ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం ఈ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు 40 మంది బాలలు, 30 మంది బాలికలు హాజరయ్యారు. ఎంపికల ప్రక్రియను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.రామారావు, బాస్కెట్‌బాల్ కోచ్‌లు పీ.వీ.రమణ, కృష్ణమూర్తి, రామారావు, భరత్‌చంద్ర పర్యవేక్షించారు.
జట్లు ఇవే...
అండర్–17 బాలుర బాస్కెట్‌బాల్ జట్టుకు అక్కి ఆయాన్, కె.స్నేహిత్, యశ్వంత్, హర్షవర్ధన్, సాత్విక్, సుమంత్, జెస్సు కిరణ్, చరణ్, సూర్య, గౌతమ్ సాహూ, ఎం.సాకేత్, రేహాన్, రైసింగ్, ఎస్.సాకేత్, అభినవ్, విశ్వతేజ, చత్రపతి శివాజీ, ఎండీ.గౌస్ అస్లాం ఎంపియ్యారు. అలాగే, బాలికల జట్టులో పి.అఖిల, రిశివశ్రీ, పూనం హన్సీ, సహస్ర, ఓంకారుణ్య, ఆయుషాన్ని, కీర్తి స్వప్నిక, తమన్ వి.తమరిత, చందనశ్రీ, దీక్షిత, యక్షిత, సాత్విక, ధతి, మనస్విని, కీర్తన, బి.హరిణి, కె.రితికాశాస్త్ర, కె.గ్రేస్‌కు స్థానం దక్కింది.
అండర్–19 బ్యాడ్మింటన్, కరాటే జట్లు..
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను కోచ్‌లు జి.రాము, గోపతి సైదులు ఎస్.కే.ఖాసీం, ఎం.బాబు, ఎండీ. మహహబూబ్, ఎం.సురేష్, హరీష్, ఎం.సందేష్ పర్యవేక్షించగా జట్ల వివరాలను అండర్–19 క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం ప్రకటించారు. అండర్–19 బ్యాడ్మింటన్ బాలుర జట్టుకు ఎన్.నవీన్ ఉదయ్, ఎం.రాజీవ్, డి.నవీన్, ఎ.అరవింద్, జి.నవదీప్, బాలికల జట్టులో బి.ధరణి ప్రియ, ఎ.రష్మీ, కె.హెమీమా, ఎస్.గాయత్రి, జి.మహాలక్ష్మి స్థానం దక్కించుకున్నారు. అలాగే, కరాటే జట్టులో వివిధ కేటగీరీలకు గాను కె.అరుణతేజ్, డి.గౌరీశంకర్, కె.హర్షతేజ, కె.గణేష్, షాహిద్, ఎం.డీ. అసదుద్దీన్, ఎస్.కే.రియాన్, ఎం.లాస్యశ్రీ, వి.లక్ష్మీశ్రావణి, బి.సహస్రసేన్, ఎం.డీ.హఫషాజబీన్, కె.నిఖిత ఎంపికయ్యారు.
జీపీ కార్మికులను పర్మనెంట్ చేయాలి
ములకలపల్లి: మల్టీపర్పస్ విధానంలో చాలాఏళ్లుగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ములకలపల్లి మహాసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. తొలుత సీనియర్ నాయకుడు చిక్కుల శ్రీను సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. జీపీ కార్మికులకు గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని సంఘ జిల్లా కార్యదర్శి ఏ.జే. రమేశ్ అన్నారు. సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్, కన్వీనర్లు నిమ్మల మధు, రఘు, యాదగిరి, వెంకటప్పయ్య, చిక్కుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 
							ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
