
క్షీరమే జాలువారినట్టుగా..
కనువిందు చేస్తున్న జలపాతం
చుట్టూ అడవి.. పక్షుల కిలకిలారావాల నడుమ క్షీరమే జాలువారుతోందా అన్నట్టుగా.. తెల్లని నురుగుతో నీరు వస్తున్న ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మణుగూరు సమీపంలోని కట్టుమల్లారం వద్ద గల కొండపై ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు పట్టణ ప్రజలు, ఇతర ప్రాంతాల పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో అయితే భారీగా వస్తుంటారు. అయితే ఈ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు టూరిస్ట్ స్పాట్‌గా గుర్తించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. – మణుగూరు టౌన్