
వైభవంగా భ ద్రగిరి ప్రదక్షిణ
భద్రాచలంటౌన్ : శ్రీరాముడి జన్మనక్షత్రం పునర్వసును పురస్కరించుకుని భక్త రామదాసు ట్రస్ట్ నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం వైభవంగా గిరి ప్రదక్షిణ చేశారు. రామయ్య కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ వేడుక నిర్వహించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్, సీసీ శ్రీనివాస రెడ్డి, పీఆర్‌ఓ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.