
అడవిపంది మాంసం స్వాధీనం
ములకలపల్లి: అటవీశాఖ అధికారులు గురువారం అడవి పంది మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మాధారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ) హరిప్రశాంత్ కథనం ప్రకారం... పాల్వంచ రేంజ్ పరిధిలోని ములకలపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామ శివారులో ఉన్న మామిడితోటలో అడవిపందిని వేటాడినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అటవీశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి మృతిచెందిన అడవిపంది మాంసాన్ని, ఉచ్చులు తయారుచేసేందుకు వినియోగించే వైర్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఓ తెలిపారు. నిందితులను పాల్వంచ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఆరుగురిపై కేసు నమోదు