
గంజాయి సీజ్
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్‌టీఎఫ్ బృందం గురువారం పట్టుకుంది. పట్టణంలో రూట్‌వాచ్‌తోపాటు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా బ్యాగులో 8.6 కిలోల గంజాయి లభించింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరిని చెందిన శంకర్‌దాస్, మాటేరులు హైదరాబాద్ నగరం బోరుబండకు చెందిన అంజన్ దూబేకు గంజాయి ఇచ్చేందుకు వెళ్తున్నట్లు తేలింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయితోపాటు బైక్, రెండు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని ఎస్‌టీఎఫ్ అధికారులు తెలిపారు.