శ్రావణం.. ఆధ్యాత్మికం | - | Sakshi
Sakshi News home page

శ్రావణం.. ఆధ్యాత్మికం

Jul 25 2025 4:43 AM | Updated on Jul 25 2025 4:43 AM

శ్రావ

శ్రావణం.. ఆధ్యాత్మికం

కొత్తగూడెం టౌన్‌/జూలూరుపాడు: సకల శుభాలకు నిలయంగా భావించే శ్రావణ మాసం వచ్చేసింది. హిందువులకు శుభప్రదమైన శ్రావణ మాసం శుక్రవారం నుంచి మొదలుకానుంది. ఈ నెలంతా పండుగలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలకు తోడు వివాహ ముహూర్తాలు ఉండడంతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే వరలక్ష్మీ వ్రతం, బోనాల వేడుకలే కాక రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి ఈనెలలో రానున్నాయి.

బోనాల పండుగ ప్రత్యేకం

ఆషాఢ మాసంలో పలుచోట్ల అమ్మవార్లకు బోనాలు చెల్లిస్తుండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రావణ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వరినాట్లు ముగించుకుని అమ్మవార్లకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.

వివాహాల సందడి

శ్రావణమాసంలో శుభ ముహూర్తాలు ఉండడంతో పలువురు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 26 నుంచి వివాహాలు, నిశ్చితార్థాలు, గృహాల శంకుస్థాపన, గృహ ప్రవేశాలు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నెల 26, 27, 30, 31వ తేదీలతోపాటు ఆగస్టు 1, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 17, 18వ తేదీల్లో ముహూర్తాలు ఉండగా.. పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు ముహూర్తాలు కుదుర్చుకున్నారు. ఈ కారణంగా మండపాలు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, వంట మనుషులకు డిమాండ్‌ పెరగనుంది. శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసం సెప్టెంబర్‌ 21 వరకు కొనసాగుతుండగా శూన్య మాసం కావటంతో ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 23 నుంచి ముహూర్తాలు ప్రారంభమై 24, 26, 27, 28, అక్టోబర్‌ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31వ తేదీలతో పాటు నవంబర్‌ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27,29, 30వ తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. అనంతరం డిసెంబర్‌ 8 నుంచి ఫిబ్రవరి 6వరకు రెండు నెలల పాటు ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.

నేటి నుంచి శ్రావణమాసం

నెలంతా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు

రేపటి నుంచి వివాహ ముహూర్తాలు

పండుగల మాసం

శ్రావణ మాసం అంతా పండుగల సందడి ఉంటుంది. ఈసారి శ్రావణంలో ఐదు శుక్రవారాలు వస్తుండగా, 29వ తేదీన మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఇదేరోజు నాగపంచమి కావడంతో నాగదేవతకు పూజలు చేయనున్నారు. అలాగే, ఆగస్టు 1న రెండో శుక్రవారం, 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పండుగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి, 23న రైతులు పొలాల అమావాస్య జరుపుకోనున్నారు.

పూజలు, వ్రతాలతో పుణ్యఫలం

ఈనెల శుభఘడియలే కాక పండుగలకు నిలయంగా నిలుస్తుంది. మంచి ముహూర్తాలు అనేకం ఉన్నాయి. ఈనెలలో మహిళలకు ఇష్టమైన వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకోనున్నారు. అంతేకాక పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలను జరుపుకునేందుకు అనువుగా ముహూర్తాలు ఉన్నాయి.

– నల్లాన్‌ చక్రవర్తుల క్రాంతికుమారాచార్యులు, అర్చకులు, విద్యానగర్‌ కాలనీ

శ్రావణ మాసం విశిష్టమైనది

శ్రావణ మాసం అన్ని విధాల విశిష్టమైనది. వ్యాపార, గృహప్రవేశాలు, నూతన వ్యాపారాలు, పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో దేవతా సంబంధిత వ్రతాలు ఆచరిస్తే శుభాలు కలుగుతాయి. హిందూ, వైదిక సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తే ఆరోగ్యరమైన జీవితం గడపొచ్చు. – పురాణం కామేశ్వరశాస్త్రి,

శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం, అనంతారం

శ్రావణం.. ఆధ్యాత్మికం1
1/2

శ్రావణం.. ఆధ్యాత్మికం

శ్రావణం.. ఆధ్యాత్మికం2
2/2

శ్రావణం.. ఆధ్యాత్మికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement