
కార్మిక కుటుంబాలకు భరోసా
ప్రమాద బీమాతో
సింగరేణి(కొత్తగూడెం): కార్మిక, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి సింగరేణి సంస్థ అనేక చర్యలు చేపడుతోంది. రూపాయి ప్రీమియం చెల్లించకుండా రూ. 1.20 కోట్ల బీమా పరిహారం దక్కేలా చూస్తోంది. సింగరేణి కార్మికుడికి జాతీయ బ్యాంక్‌లైన ఎస్‌బీఐ, యూబీఐ, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కేవలం శాలరీ అకౌంట్ ఉంటే ఈ బీమా వర్తిస్తుంది. కార్మికుడికి 13 రకాల సదుపాయాలతోపాటు ప్రమాదంలో మృతి చెందితే పరిహారం అందుతుందని సింగరేణి ఉన్నతాధికారులు చెబుతున్నారు. సహజ మరణం పొందిన వారికీ రూ. ఆరు లక్షల పరిహారం అందుతుంది. సంస్థవ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, వారి కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఇటీవల మణుగూరు ఓసీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడు మూల్‌చంద్ విశ్వకర్మ, ఆర్జీ–1, ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సపోర్ట్‌మెన్ రంజిత్‌కుమార్ కుటుంబాలకు గత నెల 28న ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరిహారాన్ని అందజేశారు.
రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.20 కోట్ల పరిహారం
సహజ మరణం పొందితే రూ.ఆరు లక్షల చెల్లింపు