
యూరియా కోసం రైతుల నిరీక్షణ
కరకగూడెం: కరకగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేల్ పాయింట్‌లో యూరియా నిల్వలు ఉన్నా గురువారం పంపిణీ చేయలేదు. దీంతో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు. ఖమ్మం మార్క్‌ఫెడ్ అధికారులు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రంలో నమోదు చేసే డీసీ (డెలివరీ చలాన్) నంబర్‌ను కరకగూడేనికి బదులు పినపాకకు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో డీసీ నంబర్ రాలేదని సిబ్బంది యూరియా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై నిరసన తెలిపి, నిరాశగా వెనుదిరిగారు. కాగా యూరియా కోసం వచ్చిన వారిలో వృద్ధులు, బాలింతలు కూడా ఉన్నారు.