
ముగియనున్న గడువు
● వచ్చే నెల 4 వరకే కేటీపీఎస్ కో ఆపరేటీవ్ సొసైటీ పాలకవర్గం ● ఈసారి ఏడు నుంచి 13కు పెరగనున్న డైరెక్టర్ పోస్టులు
పాల్వంచ: కేటీపీఎస్ కో ఆపరేటీవ్ సొసైటీ పాలకవర్గ ఐదేళ్ల పదవీ కాలం వచ్చే నెల 4వ తేదీతో ముగియనుంది. ఈక్రమంలో ఇప్పటినుంచే కొత్త పాలకవర్గంలో చోటు దక్కించుకునేందుకు పలువురు ఆశావాహులు పావులు కదుపుతున్నారు. తమను గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సొసైటీకి చివరిసారిగా 2019, నవంబర్ 4న ఎన్నికలు జరగ్గా, 5న కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. గత కమిటీ 1535, టీఆర్‌వీకేఎస్, 327 యూనియన్ల నేతలు ఎన్నికయ్యారు. ఐదేళ్ల కాలంలో రెండు పాలక వర్గాలు కొలువు దీరాయి. కాగా సొసైటీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తాయి. అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, డైరెక్టర్లను ఎన్నుకుంటారు.
ఓటర్ల జాబితా సిద్ధం
కేటీపీఎస్ కోఆపరేటీవ్ సొసైటీలో 3,008 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి జిల్లా కో ఆపరేటీవ్ అధికారులకు సమర్పించా రు. కో ఆపరేటీవ్ సొసైటీ కమిషనర్ ఆదేశిస్తే ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా సహకార శాఖ అధికారులు ఆర్‌సీఎస్(రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటీస్)కు సమాచా రం అందించాలి. అనంతరం ఎన్నికల షెడ్యూల్ తయారు చేయారు చేయాలి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని ఒఅండ్‌ఎం(పాత ప్లాంట్) మూసివేయడంతో పలువురు ఉద్యోగులు వైటీపీఎస్, బీటీపీఎస్ కర్మాగారాలకు బదిలీ అయ్యారు. అయినా వారు కూడా ఇక్కడి ఓటర్ల లిస్ట్‌లోనే కొనసాగనున్నారు.
గతంలో ఏడు.. ఇప్పుడు 13 డైరెక్టర్ పోస్టులు
గతంలో ఏడుగురు డైరెక్టర్ పోస్టులు ఉండగా ఈ సారి 13 డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పోస్టులకు ఏడు జనరల్, రెండు బీసీలతోపాటు ఎస్సీ మహిళ, బీసీ మహిళ, ఎస్టీ పురుషులకు రిజ్వరేషన్ ఉండనుంది. దీంతో ఆశావా హుల సంఖ్య మరింత పెరిగింది. రాజకీయ పార్టీ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి. ఒక్కో ఓటుకు కనీసం రూ.10వేల వరకు పంపకాలు చేపడతారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారీగా ఖర్చు చేసేందుకు ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లలో రెండు పాలక వర్గాలు..
కేటీపీఎస్ సొసైటీ ఐదేళ్ల పదవీకాలంలో రెండు పాలకవర్గాలు కొలువుదీరాయి. 2019లో ఎన్నికై న తర్వాత ప్రెసిడెంట్‌గా దానం నర్సింహారావు, సెక్రటరీగా వల్లమల్ల ప్రకాష్, ట్రెజరర్‌గా మహేందర్, వైస్ ప్రెసిడెంట్‌గా నాగమణి, డైరెక్టర్‌లుగా ధర్మరాజుల నాగేశ్వరరావు, నూనావత్ కేశులాల్ నాయ క్, రమణలు ఎన్నికయ్యారు. అనంతరం సొసైటీ సభ్యులుగా ఉన్న 400మంది ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. దీంతో బదిలీ అయినవారి సభ్యత్వాల తొలగించాలనే అంశంపై తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఈ క్రమంలో నాలుగేళ్ల 8 నెలలు పదవీలో ఉన్న అధ్యక్ష, కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో గతేడాది జూలై 1న కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ధర్మరాజుల నాగేశ్వరరావు, సెక్రటరీగా కేశులాల్, ట్రెజరర్‌గా మహేందర్, వైస్ ప్రెసిడెంట్‌గా నాగమణి, మరికొందరు డైరెక్టర్లుగా రెండో పాలకవర్గం ఏర్పాటైంది.