
రామయ్య సేవలో దేవసేన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారిని బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదా శీ ర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్, పండితులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
గర్భిణులను సురక్షిత
ప్రాంతాలకు తరలించాలి
కొత్తగూడెంఅర్బన్: వర్షాలు, వరదల నేపథ్యంలో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జయలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధంగా ఉండాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రోగ్రాంఆఫీసర్ డాక్టర్ మధువరన్, డాక్టర్ పి. స్పందన, డాక్టర్ తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
ఎద్దు మృతి
టేకులపల్లి: మండలంలోని కుంటల్ల పంచాయతీ అందుగులగూడేనికి చెందిన రైతు గొగ్గెల కోటేశ్వర్‌రావుకు ఎద్దు బుధవారం మేతకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి మృతిచెందింది. విద్యుదాఘాతంతో తన కు జీవనాధారమైన ఎద్దు మృతి చెందిందంటూ బాధిత రైతు కన్నీరు పెట్టుకున్నాడు.

రామయ్య సేవలో దేవసేన

రామయ్య సేవలో దేవసేన