
పెరిగిన కిన్నెరసాని
పాల్వంచరూరల్ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద భారీగా వచ్చి చేరడంతో కిన్నెరసాని జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లో మంగళవారం 399 అడుగుల నీటిమట్టం నమోదైంది. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 16,700 క్యూసెక్కుల వరద నీరు రావడంతో బుధవారం నాటికి నీటిమట్టం 402.50 అడుగులకు పెరిగినట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు. వరద ఇంకా పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని, దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

పెరిగిన కిన్నెరసాని

పెరిగిన కిన్నెరసాని