
తాలిపేరు.. వరద జోరు
15 గేట్లు ఎత్తి 33వేల
క్యూసెక్కుల నీటి విడుదల
చర్ల: తాలిపేరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రాజెక్టుకు చెందిన 15 గేట్లు ఎత్తి 32,981 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెల్లవారుజామున 8 గేట్లను మూడడుగుల మేర ఎత్తి 15,208 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తుండగా ఉదయం 7 గంటల నుంచి వరద ఉధృతి పెరిగింది. దీంతో మరో 7 గేట్లు కూడా ఎత్తి 28,600 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న తాలిపేరు నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతుండుగా ప్రాజెక్టులోకి మరింతగా వరద నీరు వచ్చే ప్రమాదం ఉండడంతో ఈఈ సయ్యద్ అహ్మద్‌జానీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. డీఈ తిరుపతి, ఏఈలు ఉపేంద్ర, సంపత్ ప్రాజెక్టు వద్దనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.