
తపాలా శాఖలో ఐటీ 2.0 సేవలు
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖలో ఐటీ–2.0 సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సురక్షితంగా, వేగంగా వినియోగదారులకు సేవలు అందించమే లక్ష్యంగా తపాలా శాఖ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఇప్పటికే కర్ణాటకతో పాటు హైదరాబాద్ సర్కిల్‌లో అమలవుతున్న విధానాన్ని మంగళవారం మిగతాచోట్ల ప్రారంభించగా, ఖమ్మం తపాలా డివిజన్ పరిధిలోనూ అమల్లోకి వచ్చింది. డివిజనల్ కార్యాలయంతో పాటు పది సబ్ డివిజన్ కార్యాలయాలు, ఖమ్మం, కొత్తగూడం, భద్రాచలం హెడ్ పోస్టాఫీసులు, 70 సబ్ పోస్టాఫీసులు, 750 బ్రాంచిల్లో ఐటీ–2.0 ద్వారా పొదుపు పథకాలు, డిపాజిట్లు, బీమా, ఐపీపీబీ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. తొలిసారి తపాలా కార్యాలయాల్లో ఐటీ–2.0 సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి రాగా ఖమ్మం డివిజన్‌లోని పలు బ్రాంచ్‌ల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఉద్యోగులు సమీప బ్రాంచ్‌ల ద్వారా సేవలందించారు.
తొలిరోజు అక్కడక్కడా సాంకేతిక సమస్యలు