
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
పాల్వంచ: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంటే దోమలు ప్రబలకుండా ఉంటాయని సూచించారు. నవ లిమిటెడ్ వారు విద్యార్థుల ఆరోగ్యంపై తీసుకుంటున్న చర్యలను అభినందించారు. కార్యక్రమంలో నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్‌లు ఎంజీఎం ప్రసాద్, బి.రామారావు, పాఠశాల హెచ్‌ఎం రమ, మొబైల్ సైన్స్ సిబ్బంది రాజేశ్వరరావు, రాజేష్ పాల్గొన్నారు.