
ప్రిన్సిపాల్, వార్డెన్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
కళాశాల గేట్ వద్ద విద్యార్థినుల ధర్నా
భద్రాచలంటౌన్: భద్రాచలం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు కళాశాల ప్రధాన గేట్ వద్ద మంగళవా రం ధర్నా చేశారు. కళాశాలలో రెండు రోజుల కిందట విద్యార్థినులకు ఉదయం వడ్డించే కిచిడీలో పురుగులు వచ్చాయని ఆందోళన చేయడంతో విచారణకు ఆదేశించిన ఐటీడీఏ పీఓ.. ఘటనకు కారకులైన వార్డెన్, ప్రిన్సిపాల్ ను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, విద్యార్థినులు వార్డెన్, ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని ధర్నా చేయడం చర్చనీయాంశమైంది. కళాశాలలో మెనూ అమలు విషయంలో ప్రిన్సిపాల్, వార్డెన్‌ల నిర్లక్ష్యం లేద ని, బియ్యంలో పురుగులు ఉండడంతోనే అలా జరిగిందని వారు పేర్కొన్నారు.
ఒకేసారి రెండు
ప్రభుత్వ ఉద్యోగాలు
సుజాతనగర్: ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఈ రోజుల్లో చాలాకష్టంతో కూడుకున్న పని. కానీ, మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన మాలోత్ చంపాలాల్ ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన మాలోత్ గ్యామా, సాలి దంపతుల రెండో కుమారుడు చంపాలాల్ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ)లో జూని యర్ ఇంజనీర్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అలాగే, ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌బీ ఫలితాల్లో జూనియర్ ఇంజనీర్‌గా మరో కొలువు సాధించాడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన చంపాలాల్‌ను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
ఎస్సీ రైతులు పేర్లు నమోదు చేసుకోండి
అశ్వారావుపేటరూరల్: ఉద్యాన విశ్వవిద్యాల యం పరిధిలోని అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు పై ఎస్సీ రైతులకు ఒక రోజు శిక్షణ ఏర్పాటు చేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త విజయ్‌కృష్ణ కోరారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. భారతీయ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ సౌజన్యంతో ఎస్సీ రైతులకు పలురకాల ఉద్యాన పంటల సాగుపై త్వరలో ఒకరోజు శిక్షణ నిర్వహిస్తామని, ఈ నెల 27వ తేదీలోపు తమ పేర్లను 79958 90625 నంబర్‌లో సంప్రదించి నమోదు చేసుకోవచ్చన్నారు. శిక్షణలో ఒక్కొక్క రైతు కు 10 రకాల పండ్ల మొక్కల్ని అందించి, వాటి పెంపకంపై శిక్షణ ఇస్తామని తెలిపారు.