
చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి
జూలూరుపాడు: పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ దయానంద్ కథనం ప్రకారం.. భేతాళపాడు జీపీ పంతులుతండాకు చెందిన ధరావత్ కాంతి (70).. తన పని తాను చేసుకునే పరిస్థితి లేక జీవితంపై విరక్తి చెంది ఈ నెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్ దయానంద్ పేర్కొన్నారు.
ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ
పాల్వంచ: ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా లారీ రివర్స్‌లో వచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఉల్లిపాయల వ్యాపారి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పాల్వంచ మున్సిపల్ పరిధిలోని రాంనగర్‌కు చెందిన ధనుకోటి నరసింహనాయుడు (43) ట్రాలీ ఆటోలో ఉల్లిపాయల వ్యా పారం చేస్తుంటాడు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఉల్లిపాయలతో ఇంటి నుంచి బయలు దేరి కొత్తగూడెం వైపు వెళ్తున్నాడు. ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వద్ద యూటర్న్ వద్దకు రాగానే అక్కడ ఉన్న లారీడ్రైవర్ లారీని రివర్స్‌లో తీసుకొచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు. ఆటోలో ఇరుక్కున్న నరసింహనాయుడును బయటకు తీసి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. తలకు తీవ్ర గాయాలతో అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా లారీడ్రైవర్ ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన భూక్యా శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట స్థావరంపై దాడి
పినపాక: మండలంలోని బయ్యారం గ్రామంలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బయ్యారంలోని ఓ ఇంట్లో పేకాడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.46 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
ఇసుక అక్రమ నిల్వలు సీజ్
బూర్గంపాడు: సారపాక గ్రామ పంచాయతీలోని భాస్కర్‌నగర్‌లో ఇసుక అక్రమ నిల్వలను తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్ మంగళవారం సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీజ్ చేసిన ఇసుకను గ్రామపంచాయతీ అధికారులకు అప్పగించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు.
ఒకరు మృతి