
చెక్‌డ్యామ్ ఎత్తు తగ్గింపు పనులు ప్రారంభం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ప్రకాష్‌నగర్ వద్ద మున్నేటిపై ఉన్న చెక్‌డ్యామ్ ఎత్తు తగ్గింపు పనులు మొదలయ్యా యి. జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో చెక్‌డ్యామ్ వద్దకు యంత్రాలు వెళ్లేలా అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను రెండు రోజులుగా తొలగిస్తున్నారు. ఇదేసమయాన చెక్‌డ్యామ్ దిగువన ప్రకాష్‌నగర్ వంతెన చప్టాకు గండ్లు పెట్టి వరద నీరు ముందుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు చెక్‌డ్యామ్ ఎత్తు సగం మేర తగ్గించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈమేరకు వరద ప్రవాహం ఆధారంగా ఒకటి, రెండు రో జుల్లో గ్రానైట్ కట్టర్ సాయంతో చెక్‌డ్యాం ఎత్తు తగ్గించే పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.