
26 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
అశ్వారావుపేటరూరల్: ఈ నెల 26, 27వ తేదీల్లో అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ జరిగే సీపీఐ జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా కోరారు. సోమవారం అశ్వారావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక పోరాటాల ప్రాంతం, ఏజెన్సీ గ్రామాలకు కేంద్రమైన అశ్వారావుపేటలో జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ సభలకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభల్లో భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన, జిల్లా అభివృద్ధి సాధన, రానున్న మూడేళ్ల కార్యచరణను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్‌డి.సలీం, నారాటి ప్రసాద్, గన్నిన రామృకష్ణ, విజయ్‌కాంత్, ఎస్‌డి.జాకీర్, సత్యవతి, సూర్యకుమారి, రిజ్వాన పాల్గొన్నారు.